టి20 ప్రపంచ  కప్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం ఈరోజు కానుండగా ఈ మ్యాచ్లో విజేత ఎవరు, ఏ దేశం ఎలా ఆడుతుందో తెలుసుకుందాం..?
టి20 ప్రపంచ కప్ విజేత ఎవరో ఇవాళ తేలిపోనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తుది పోరులో తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా  ఇవాళ రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన కివీస్ ఈసారి టి20 వరల్డ్ కప్ సాధించాలని పట్టుదలగా ఉంది. బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో బ్యాటింగ్ లోనూ  సత్తా చాటింది. ఐసీసీ టోర్నీలో మెరుగ్గా ఆడుతున్నా తుది పోరులో ఒత్తిడిని అధిగమించ లేక  తడబడటం కివీస్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.


ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కు ఆసీస్ పై మంచి రికార్డు ఉంది . మరో ఓపెనర్ డేరిల్ మిజెల్  సెమీస్ లో అద్భుతంగా ఆడి జట్టు విజయానికి పాల్పడ్డారు. వీరిద్దరూ బాగా ఆడితే కివీస్ కు మంచి ఆరంభం లభిస్తుంది. కెప్టెన్ కేన్ విలియమ్స్ ఫామ్ లేని ఆ జట్టును కలవరపరుస్తోంది. కివీస్  ఇంత వరకు ఒక టి20 వరల్డ్ కప్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా కు వరల్డ్ కప్ లు గెలిచిన అనుభవం ఉంది. అయితే ఈ జట్టు ఇంతవరకు టి20 వరల్డ్ కప్ గెలుచుకో లేదు. దీంతో టైటిల్ గెలవాలRaని ఆసిస్ భావిస్తోంది . కివీస్ ను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. సెమీస్ లో పాకిస్థాన్ పై అద్భుతంగా రాణించిన మార్కస్ తమ జోరు కొనసాగించాలని చూస్తున్నారు. బౌలింగ్ విభాగంలో మాత్రం ఆస్ట్రేలియా బలంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: