టీమిండియాలో ఎన్నో రోజుల నుంచి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి ఒక ప్రచారం అందరినీ ఆకర్షిస్తుంది. భారత క్రికెట్ లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. అందుకే ఒకరితో ఒకరు కనీసం మాట్లాడడం కూడా లేదని టాక్ కూడా వినిపించింది. ఇటీవలే విరాట్ కోహ్లీనీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మ ను కొత్తగా కెప్టెన్గా బాధ్యతలు అప్పగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.  అంతే కాకుండా భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య వివాదం ముదిరి పోవడంతో ఒకరి కెప్టెన్సీలో ఒకరు  ఆడటానికి ఆసక్తి చూపడం లేదు అంటూ ప్రచారం జరిగింది.



 గాయం బారినపడి రోహిత్ శర్మ టెస్టు సిరీస్ కు దూరం కావడంతో.. ఇక కూతురు పుట్టిన రోజు కారణంగా చూపుతూ విరాట్ కోహ్లీ కూడా సౌతాఫ్రికాలో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో జరిగే  వన్డే సిరీస్కు దూరంగా కాబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. ఇలా ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడదానికి ఇష్టపడటం లేదు అంటూ ప్రచారం జరిగింది. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత జట్టు  చీప్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రోహిత్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయి అన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు ఆయన. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు అంటూ చెప్పుకొచ్చారు. పని పాట లేని వాళ్ళు ఇలాంటి పుకార్లను పుట్టిస్తూ ఉంటారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.


 రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వచ్చే వార్తలను చూసి అందరు నమ్ముకుంటాము అంటూ చెప్పుకొచ్చారు. రోహిత్ కోహ్లీ ఒక ఫ్యామిలీ లా కలిసి ఉంటారని.. వారిద్దరూ భవిష్యత్తు గురించి రాబోయే ఐసీసీ టోర్ని ల గురించి చర్చించుకుంటూ ఉంటారు అంటూ చేతన్ శర్మ తెలిపారు. ప్రస్తుతం జట్టులో ఆటగాళ్ళ మధ్య వాతావరణం ఎంతో బాగుందని ఎవరి మధ్య కూడా ఎలాంటి విభేదాలు లేవు అంటూ స్పష్టం చేశారు. కాగా ఇటీవలే రోహిత్ శర్మ గాయం బారినపడి కేవలం టెస్టు సిరీస్ కు మాత్రమే దూరమయ్యాడు అనుకుంటున్న సమయంలో అటు వన్డే సిరీస్కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: