ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఎంతోమంది స్టార్ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు సాధించిన ఆటగాళ్లను సైతం పూర్తిగా పక్కన పెట్టేసాయ్ ఫ్రాంచైజీలు అని చెప్పాలి. మెగా వేలంలో భారీ ధర పలుకుతారూ అనుకున్న ఆటగాళ్లు చివరికి ఐపీఎల్ మెగా వేల ముగిసేసరికి అన్ సోల్డ్ గా మిగిలిపోయారు.  మరిముఖ్యంగా ఇక ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ ఆటగాడి గా కొనసాగుతున్న సురేశ్ రైనాను ఇటీవలే మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం సంచలనంగా మారిపోయింది.


 అయితే ఐపీఎల్ లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో స్టార్ ప్లేయర్గా కొనసాగాడు సురేష్ రైనా. అంతేకాదు కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన ఐదు వేలకు పైగా పరుగులు చేశాడు. ఇలాంటి స్టార్ ప్లేయర్ ని మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ  కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే రిటైన్ చేసుకోకుండా మెగా వేలంలో కి వదిలేసిన సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ కొనుగోలు చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి చెన్నై సురేష్ రైనాను ఎంపిక చేయకపోవడంపై ఎంతోమంది అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలే ఐపీఎల్ లో సెలెక్ట్ కాకపోవడం పై స్పందించిన సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐకి ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే అవకాశం దొరకని భారత ఆటగాళ్లకు ఇతర దేశాల క్రికెట్ లీగ్స్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. కాగా బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డు కాంట్రాక్టు కలిగిన క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి విదేశీ  లీగ్ లలో ఆడేందుకు అనుమతి లేదు. భారత్లో అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్ బై చెబితేనే ఇతర దేశాల లీగ్ లకు ఆడేందుకు అనుమతి ఉంటుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా అటు దేశవాళి క్రికెట్ టోర్నీలలో మాత్రం ఆడుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే సురేష్ రైనా రిక్వెస్ట్ పై బిసిసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: