సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం క్రికెటర్లకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా అదే రీతిలో సోషల్ మీడియాలో పాపులారిటీ వస్తుంది. అందుకే ఇక అటు క్రికెటర్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏదైనా పోస్టు పెడితే అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారి పోవడం జరుగుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇటీవలే ఇదే విషయంపై స్పందించారు టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి.



 వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఐపీఎల్ 2022 సీజన్ ఆడేందుకు ధోని జట్టుతో కలిసి సూరత్ క్యాంపెయిన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మహేంద్రుడు తో పాటే భార్య సాక్షి సింగ్ ధోనీ కూతురు కూడా ఉన్నారు. ఇక ఇటీవలే  అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎస్కే యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక సెషన్ లో ధోనీ భార్య సాక్షి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఏకంగా కోట్ల మందిలో 11 మంది మాత్రమే జట్టులో ఉన్న క్రికెటర్లను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. ముఖ్యంగా క్రికెట్ ను మతంగా భావించే దేశంలో అభిమానుల ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. క్రికెటర్ అన్ని పెళ్లాడిన తర్వాత జీవితంలో పూర్తిగా మార్పులు వచ్చేస్తాయి.


 ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లి ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తను పెళ్లాడితే ఎలాంటి మార్పు పెద్దగా ఉండదు. కానీ ఒక క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటే ఎన్నో మార్పులు కూడా. ఎప్పుడు కెమెరాలు వెంటాడుతూనే ఉంటాయి. వ్యక్తిగత స్వేచ్ఛ అసలు దొరకదు. కొందరికైతే కెమెరాలతో ఇబ్బంది ఉండదు. కాని మరికొందరు చాలా ఇబ్బంది పడతారు. అది కాకుండా జనాలు మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయిస్తూ  ఉంటారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలనేది కూడా ఇక అటు జనాల చెబుతూ ఉంటారు. ఎంత క్రికెటర్ల భార్య అయినా మాకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది కదా.. బయట మాకు ఎలాగో అవకాశం లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా మా స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాము. కానీ కొంతమంది దీనిని దూరం చేస్తున్నారు. ఇలాంటి పట్టించుకోవడం వల్ల తలనొప్పి తప్ప  ఇంకా ఏమి ఉపయోగం ఉండదు అంటూ సాక్షి చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: