మొన్నటికి మొన్న జరిగిన రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేసిన పృథ్వీ షా అటు ఐపీఎల్ లో మాత్రం అదరగొడుతున్నాడు. ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ కావడంతో అటు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న పృథ్వీ షా అటు ఐపీఎల్ లో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ తో ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొనసాగుతోన్న పృథ్వీ షా ఇటీవల ఛాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్ తో జరిగిన  మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించడంలో కీలకపాత్ర వహించాడు. ధన ధన ఫటాఫట్ అనే రేంజిలో తన ఇన్నింగ్స్ ఆరంభించి జట్టుకు మంచి స్కోరు అందించాడు పృథ్వీ షా.  ఇకపోతే పృథ్వీ షా బ్యాటింగ్ పై ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు ఆ జట్టు మాజీ అసిస్టెంట్ కోడ్ మహమ్మద్ కైఫ్.


 2019 నుంచి 2021 వరకు కూడా మూడు సీజన్ల పాటు మహమ్మద్ కైఫ్ ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా కొనసాగాడు అన్న విషయం తెలిసిందే. యువ ఆటగాడు పృథ్వీ షాకు బ్యాటింగ్ లో మంచి శిక్షణ కూడా అందించాడు. ఇకపోతే ఇటీవల ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన మహమ్మద్ కైఫ్ పృథ్వీషా బ్యాటింగ్ సీక్రెట్ ఏంటి అన్న విషయాన్ని బయట పెట్టాడు. నేను ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా ఉన్న సమయంలో పృథ్వీ షాతో ఎక్కువగా సమయం కేటాయించేవాడిని.. ఇక ప్రతి మ్యాచ్ కు ముందు పృథ్వీ షా ఒక పద్ధతిని పాటించేవాడు.



  నేను కొత్త బంతి అందుకుని అతడి మోకాలి మీదికి బంతులు వేసేవాడిని అతను తిరిగి నా వైపే షాట్లు ఆడుతూ ఉండేవాడు. అయితే ఒక సారి పృథ్వీషా పరుగులు చేయ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇక ఈ ప్రాక్టీస్ విధానాన్ని పూర్తిగా మానేసాడు. ఇక ఆ తర్వాత పృథ్వీషా నా దగ్గరికి వచ్చి దయచేసి చేతులు కిందికి బంతులు వేయండి ఎందుకంటే నేను పరుగులు చేయలేకపోతున్నాను ఆ పద్ధతిని మళ్లీ కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే అతడు మంచి పరుగులు చేశాడు. ఒకవేళ కొత్త పద్ధతి పనికి వస్తే దాన్ని మధ్యలో ఆపొద్దు అని ఆ సమయంలో సూచించాను అంటూ మహమ్మద్ కైఫ్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl