మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్ కెప్టెన్సికీ పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. భారత క్రికెట్లో ఇప్పటికే దిగ్గజ కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో కూడా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా నాలుగు సార్లు టైటిల్ అందించిన ఛాంపియన్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే జట్టు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ స్వరూపాన్ని తనవైపు తిప్పుకునేందుకు సైలెంట్ గా ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఉంటాడు.


 అంతేకాదు బౌలింగ్ విభాగానికి కూడా తన వ్యూహాలతో ముందుకునడిపించడంలో సక్సెస్ అవుతాడూ మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే ఫీల్డింగ్ సెట్ చేసే క్రమంలో కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లకు సైగలు చేస్తూ సైలెంట్ గా వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇలా ధోని సైగలు చేయడం తనకు ఏమాత్రం అర్థం కాలేదు అంటూ చెబుతున్నాడు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్. ధోని సైగలు చేసినప్పుడు ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాక పోయేది. ఇటీవలే బ్రేక్ ఫాస్ట్  విత్ చాంపియన్స్ అని యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన ఇషాన్ కిషన్ ధోనీతో తనకు ఎదురైన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.


 ఓ సారి నేను విజయ్ హజారే ట్రోఫీ లో ఆడుతున్న సమయంలో ధోనీ జట్టులో ఉన్నా.. ఆ సమయంలో నేను థర్డ్ మ్యాన్ దిశలో ఫీల్డింగ్  చేస్తూ ఉన్నాను. అయితే వికెట్ల వెనకాల ఉన్న మహేంద్రసింగ్ ధోని  గాల్లో చేతులు ఊపుతూ ఫీల్డర్లను అటూ ఇటూ మారాలి అంటూ చెబుతున్నాడు. ఇక నాకు కూడా అలాగే చేశాడు. అయితే ధోనీ ఎక్కడికి వెళ్లాలని చెప్పాడో నాకు మాత్రం సైగలతో అర్థం కాలేదు. ఇక పక్కనే ఉన్న ఫీల్డర్ ని నేను ఎక్కడికి వెళ్లాలో ధోనినీ అడిగి చెప్పవా అంటూ కోరాను. అయితే మళ్లీ మహీంద్రా అలాగే చేతులు ఊపి ఒక సైగ చేసాడు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి అర్థం కాక తికమక పడ్డాను అంటూ అప్పుడు సరదా ఘటనను గుర్తు చేసుకున్నాడు ఇషాన్ కిషన్. అలాగే ఓ సారి 20 లీగ్ లో బాగా ఆడుతున్నప్పుడు ధోని బౌలర్లకు ఏదో చెప్పి నన్ను అవుట్ చేశాడు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: