రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతోన్న జోస్ బట్లర్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ వరుస సెంచరీలతో చెలరేగిన పోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. ఇక అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసి అదరగొడుతున్నాడు.  ఇక ఇటీవల ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. బట్లర్ లాగా తాను ఎందుకు శతకాలు చేయలేకపోతున్నాను అనే విషయం తన పిల్లలకు తెలుసుకోవాలని ఉంది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.


 ఇక తన పిల్లలు ఇప్పుడు క్రికెట్ ఆటను అర్థం చేసుకుంటూ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. కాగా ఇటీవలే ఢిల్లీ కాపిటల్స్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో 60 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు డేవిడ్ వార్నర్. ఇక మ్యాచ్ అనంతరం  మాట్లాడుతూ మా బౌలర్లు అద్భుతంగా రాణించి మా పని తేలిక చేశారు. క్రెడిట్ అంతా వాళ్ళకి దక్కుతుంది. పవర్ ప్లే లో వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. జట్టులో కరోనా కేసులు వచ్చాక కూడా మేం బాగా రాణించాము.  ఇది కేవలం సానుకూల ఆలోచన తోనే సాధ్యం అవుతుంది డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.


 ఇక నా బ్యాటింగ్ విషయానికి వస్తే జోస్ బట్లర్  లాగా నేనెందుకు శతకాలు చేయలేకపోతున్నానని నా పిల్లలకు తెలుసుకోవాలని ఉంది. క్రికెట్ ను  ప్రపంచవ్యాప్తంగా పిల్లలు  ఆస్వాదిస్తున్నారు. ఈ విషయం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. తన పిల్లలు కూడా క్రికెట్ ను అర్థం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. కాగా గతంలో బెంగుళూరు జట్టుతో మ్యాచ్ జరిగిన సమయంలో 66 పరుగులతో వార్నర్ రాణించిన సమయంలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది ఢిల్లీ. ఆ సమయంలో వార్నర్ వికెట్ పడగానే అతని కుమార్తెలు గ్యాలరీ లో నుంచి కంటతడి పెట్టిన చిత్రాలుగా వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే తాను ఎక్కువగా పరుగులు చేయాలని నా కూతుర్లు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్..

మరింత సమాచారం తెలుసుకోండి: