ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్.. పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్  ఎంతో హోరాహోరీగా జరిగింది.  వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్  అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ పంజాబ్కింగ్స్ లో జరిగిన మ్యాచ్లో గెలిచి తీరుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవిచూసింది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్  చెన్నై పై విజయం సాధించి ప్లే ఆఫ్లో అవకాశం దక్కించుకోవడానికి ఇంకా పోరాటం చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే పంజాబ్ బౌలర్లు పట్టు బిగించడంతో ఇక చెన్నై బ్యాట్స్మెన్లు చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.



 కాగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో పంజాబ్ కింగ్స్  బౌలర్ రిషి ధావన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలింగ్ లో కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఇలా బౌలింగ్ మాత్రమే కాదు మరో విషయంలో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు రిషీ ధావన్. మ్యాచ్ లో ప్లాస్టిక్ మాస్కు ధరించి ఫీల్డింగ్ చేయడమే కాదు బౌలింగ్ కూడా చేశాడు రిషి ధావన్. దీంతో అతను ఇలా ముక్కుకి ప్లాస్టిక్ మాస్క్ ఎందుకు వేసుకున్నాడు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అందరూ దీనికోసమే సోషల్ మీడియా వేదికగా వెతకడం కూడా ప్రారంభించారు. అయితే రిషి ధావన్ అలా ముఖానికి ప్లాస్టిక్ మస్క్ పెట్టుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది అని తెలుస్తూ ఉంది.


 ఇటీవలే పంజాబ్ కింగ్స్  ఆటగాడు రిషి ధావన్ ముక్కుకి గాయం అయింది. ఈ క్రమంలోనే సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముందు జాగ్రత్త గా బంతి ముక్కుకు తగలకుండా ఉండేందుకు ముక్కును కవర్ చేస్తూ ఒక సేఫ్టీ మాస్క్ పెట్టుకొని మైదానంలో ఫీల్డింగ్ చేసాడు రిషి ధావన్. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిషీ ధావన్ తన బౌలింగ్లో అదరగొడుతున్నాడు. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ లో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న శివం దూబేను వికెట్ తీసుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: