ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు ఎంత పేలవమైన ప్రదర్శన చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో వరుస విజయాలు సాధించినట్లే కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం పరాజయాలతో చతికిలబడి పోయింది జట్టు. ప్లే అఫ్ చేరకుండా ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే పంజాబ్ కింగ్స్  కెప్టెన్గా కె.ఎల్.రాహుల్ తప్పుకోవడంతో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది. ఇలా జట్టుకు కొత్త సారథి వచ్చిన అదృష్టం మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి.


 ఈ ఏడాది లీగ్ మ్యాచ్లో భాగంగా 14 భాషల్లో కేవలం 7 విజయాలు మాత్రమే సాధించింది పంజాబ్ జట్టు. ఇక పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పరిమితమైన ఈ జట్టు పేలవా ప్రదర్శనతో నిరాశపరిచింది.  2023 సీజన్ లో మాత్రం ఈ ఏడాది మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లపై వేటు వేసేందుకు ఆ జట్టు యాజమాన్యం సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 ఓడియన్ స్మిత్ : వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్ ను మెగా వేలంలో 6 కోట్లకు దక్కించుకుంది పంజాబ్ జట్టు. కానీ అంచనాలను అందుకోలేక పేలవా ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఆరు మ్యాచ్ లలో ఆరు వికెట్ల తోపాటు 51 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో ఇతనికి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

 సందీప్ శర్మ : ఐపీఎల్లో అనుభవజ్ఞుడైన ప్లేయర్ గా గుర్తింపు ఉన్న సందీప్ శర్మ ను యాభై లక్షలకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. కానీ అతడు మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టి జట్టుకు ఎక్కడ ఉపయోగపడలేదు సందీప్ శర్మ. దీంతో ఇతని జట్టు నుంచి తీసేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


 ప్రభు సిమ్రాన్ సింగ్ : యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయినా ప్రబ్ సిమ్రాన్ సింగ్ మెగా వేలంలో కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. కానీ అప్పటికే బెయిర్ స్ట్రో, జితేష్ శర్మ లాంటి ఇద్దరు వికెట్ కీపర్ లు జట్టులో ఉండడంతో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా అతను కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు అని చెప్పాలి. ఇతని వదులుకునేందుకు కూడా పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది అని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: