ప్రస్తుతం ఎంతో మంది ప్రతిభగల క్రికెటర్లు విఫలమవుతున్న వేల అటు ఒక రాష్ట్రానికి క్రీడాశాఖ మంత్రిగా ఉన్న సీనియర్ ప్లేయర్ మాత్రం ప్రస్తుతం సెంచరీలతో చెలరేగిన పోతూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే ఒక సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ క్రీడా శాఖ మంత్రి ఇక ఇప్పుడు మరో సెంచరీతో అదరగొట్టేశాడు. ఇక అతను ఆడుతున్న తీరు చూస్తే టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకుని ఆశపడే యువ ఆటగాడు ఆడుతున్నట్లు కనిపిస్తోంది అని చెప్పాలి. ఆ క్రీడా శాఖ మంత్రి ఎవరో కాదు మనోజ్ తివారి.


 టీమిండియా సీనియర్ ప్లేయర్ అయిన మనోజ్ తివారి తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. భారత జట్టులో చోటు లేక పోవడంతో క్రికెట్కు దూరంగానే ఉంటున్నాడు. అయితే ఇక ఇటీవల ఎన్నికల్లో గెలిచి ఏకంగా బెంగాల్ క్రీడా శాఖ మంత్రి పదవి బాధ్యతలు కూడా చేపట్టాడు మనోజ్ తివారి. అయితే ప్రస్తుతం రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ లలో ఆడుతున్నారు ఆయన. ఈ క్రమంలోనే కీలక సమయాల్లో శతకం సాధించి అదరగొట్టాడు అని చెప్పాలి. 12 ఫోర్లు సాయంతో సెంచరీ సాధించిన మనోజ్ తివారీ సెంచరీ చేసిన వెంటనే 102 పరుగుల వద్ద శరణ్ జైన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


 ఇక మరో ఎండ్ మనోజ్ తివారీ కి సహకరించిన షాబాజ్ అహ్మద్ కూడా సెంచరీతో మెరవడం గమనార్హం. 209 బంతుల్లో 12 ఫోర్లు సహాయంతో 116 పరుగులు చేసిన షాబాజ్ అహ్మద్ వికెట్ కోల్పో గానే అటు బెంగాల్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో ఇక బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మధ్యప్రదేశ్ జట్టుకు 68 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది అనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సెంచరీతో చెలరేగాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఇప్పుడు ఈ క్రీడా శాఖ మంత్రి ఇన్నింగ్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: