ప్రపంచ నెంబర్ 2 ర్యాంక్ లో ఉన్న స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ వింబుల్డన్ 2022 సీజన్ లో అద్భుతమైన ఆటను కనబరుస్తున్నాడు. తన లాస్ట్ గేమ్ లో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిడ్జ్ ను అయిదు సెట్ లలో మూడింటిని గెలిచి సెమీస్ కు దూసుకు వెళ్ళాడు. అయితే ఈ విజయం అతనికి అంత తేలిగ్గా రాలేదన్నది చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక్కో పాయింట్ కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. సెమీస్ లో ఇతంబు అమెరికాకు చెందిన మరో ఆటగాడు నిక్ కిర్గియోస్ తో ఈ రోజు సాయంత్రం తలపడాల్సి ఉంది. కానీ ఈ లోపే రఫెల్ నాదల్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త తెలిసింది. సెమీస్ లో రఫెల్ నాదల్ పాల్గొనడం లేదని అధికారిక వార్త వెలువడింది.

ఈ వార్తను స్వయంగా వింబుల్డన్ నిర్వాహకులు ప్రకటించడం విశేషం. అయితే ఎందుకు నాదల్ ను సెమీస్ నుండి తొలగించారు అన్న విషయానికి వెళితే... నాదల్ కు వింబుల్డన్ కన్నా ముందు పొట్టి కడుపులో నొప్పి కారణంగా బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ దానికి తగిన చికిత్స తీసుకుని టోర్నీలో ప్రవేశించి వరుసగా మ్యాచ్ లు గెలుచుకుంటూ వచ్చాడు. అయితే క్వార్టర్స్ లో మ్యాచ్ లో ఎక్కువగా కష్టపడడం వలన ఆ భారాన్ని తన శరీరం తీసుకోలేకపోయింది. నిన్న రాత్రి కడుపులో నొప్పి మరింత ఎక్కువ కావడంతో నాదల్ ఈ నిర్ణయం తీసుకుని వింబుల్డన్ కు తెలియచేశాడు. వింబుల్డన్ టైటిల్ ను గెలవడం కన్నా కూడా ఆరోగ్యం చాలా ముఖ్యమని నాదల్ చెప్పడం విశేషం.

ఇక ఈ సంవత్సరం నాదల్ ఎంతో అద్బుతమయిన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ లను గెలుచుకున్నాడు. ఇక వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లలో కూడా గెలిచి ఒకే సంవత్సరంలో అన్ని గ్రాండ్ స్లాం లను గెలిచిన రాడ్ రోవర్ తర్వాత వ్యక్తిగా రికార్డు సృష్టించాలన్న కల అలాగే ఉండిపోనుంది. దీనితో అభిమానులు చాలా బాధపడుతన్నారు. ఇక కిర్గియోస్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధించాడు. ఈ రోజు సెమీఫైనల్ లో జొకోవిచ్ నోరీతో పోటీ పడతాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: