కొన్ని నెలల క్రితం ముగిసిన ఐపీఎల్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమిండియాలో అవకాశం దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా అవకాశం దక్కించుకున్న  వారిలో అర్ష దీప్ సింగ్ కూడా ఉన్నాడు. టీమిండియా లోకి  వచ్చిన తర్వాత కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక తన ప్రదర్శనతో తాను టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అని చెప్పకనే చెబుతున్నాడు. ఈ క్రమంలోనే అతని బౌలింగ్ టెక్నిక్ ద్వారా ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక అర్షదీప్ సింగ్ ప్రతిభపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి.  టీ-20 ఫార్మెట్లో ప్రపంచంలోనే నెంబర్వన్ బౌలర్ గా ఎదిగేంత  సత్తా అర్షదీప్ సింగ్ లో దాగి ఉంది అంటూ కొనియాడాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న టి20 వరల్డ్ కప్ లో అర్షదీప్ సింగ్ ను  తప్పక సెలెక్ట్ చేయాలి అంటూ సూచించాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన అర్షదీప్ సింగ్ 14 ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీశాడు.


 తన అద్భుతమైన బౌలింగ్ కు ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫాస్ట్బౌలర్ కు అతి తక్కువ సమయంలోనే బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనలో టి20 సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఇటీవల జట్టులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్ తో పోల్చి చూస్తే అది ఒక అడుగు ముందే ఉన్నాడు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ..  అర్షదీప్ సింగ్ ఒక అద్భుతం.. పేరు గుర్తు పెట్టుకోండి ప్రపంచ కప్ జట్టులో అతను ఉంటాడు. కమాన్ చైతు.. ప్లీజ్ అర్షదీప్ సింగ్ ఈ పేరును పరిగణనలోకి తీసుకో.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కు విజ్ఞప్తి చేశాడు కృష్ణమాచారి శ్రీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: