మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియాకప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఆసియా కప్లో భాగంగా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తుంది ఈ నెల 28వ తేదీన జరగబోయే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ గురించి అన్న విషయం తెలిసిందే. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మొదటి సారి భారత్ పై విజయం సాధించింది పాకిస్తాన్. ఇప్పుడు ఆసియా కప్లో భాగంగా ఆ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది టీమిండియా. అదే సమయంలో మరోసారి టీమిండియాపై విజయం సాధించాలనే కసితో ఉంది పాకిస్తాన్. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో కీలక పేసర్ గా కొనసాగుతున్న షాహిన్ ఆఫ్రిది గాయం కారణంగా ఆసియాకప్ దూరమయ్యాడు. ఈ క్రమంలోనే కీలక బౌలర్ దూరం కావడం పాకిస్థాన్ కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహీన్ అఫ్రిది తప్పుకోవడంతో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఊపిరిపీల్చుకున్నారు అంటూ యూనిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే గత ఏడాది జరిగిన టి 20 ప్రపంచకప్లో భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించడంలో షాహీన్ అఫ్రిది కీలక పాత్ర పోషించాడు.


 రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లను పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక భారత్ తో మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే యూనిస్ మాట్లాడుతూ షాహీన్ అఫ్రిది దూరం కావడం భారత్కు పెద్ద రిలీఫ్.. ఆసియా కప్లో అతడు భాగం కాకపోవడం పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ.. త్వరగా కోలుకొని జట్టులో చేరతాడని ఆశిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై భారత్ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రిదికి అంత సీన్ లేదు ముందు ఆసియాకప్ లో గెలిచి చూపించండి అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: