గత కొన్ని సీజన్స్  నుంచి ఐపీఎల్ లో  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతలా  పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.   భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి సరైన ప్రదర్శన చేయలేక పోవడం లాంటివి జరుగుతూ వస్తోంది. అంతేకాదు గత కొన్ని రోజుల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో  అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. డేవిడ్ వార్నర్ ను సైతం జట్టు యాజమాన్యం పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి.  అయితే 2023 ఐపీఎల్ సీజన్ లో  మాత్రం ఎలాంటి తప్పులు చేయకూడదు అని జట్టు యాజమాన్యం భావిస్తోంది.


 ఈ క్రమంలోనే ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది అని  తెలుస్తుంది. గత రెండు సీజన్స్  నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్గా, క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న టామ్ మూడినీ  తప్పించి అతని స్థానంలో విండీస్ దిగ్గజ బ్యాట్స్మన్ బ్రియాన్ లారా కి కోచ్గా బాధ్యతలు అప్పగించింది.  అయితే 2022 సీజన్లో సన్రైజర్స్ బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు బ్రియాన్ లారా.  ఇప్పుడు పూర్తిగా హెడ్ కోచ్ గా మారాడు.  ఈ క్రమంలోనే జట్టులో డేవిడ్ వార్నర్ ను  కెప్టెన్సీ నుంచి తప్పించడం ఆ తర్వాత అతనితో జట్టులో కూడా చోటు కల్పించడం వివాదాస్పదంగా మారింది.  2021 సీజన్ ఫెయిల్యూర్ తర్వాత బ్రెవిస్   బెల్లీస్ తప్పుకోవడంతో హెడ్ కోచ్గా టామ్ మూడి  బాధ్యతలు చేపట్టాడు.


 అయితే హెడ్ కోచ్ గా టామ్ ముడికి  డేవిడ్ వార్నర్ కు మధ్య విభేదాలు ఉన్న కారణంగానే అతన్నీ  కెప్టెన్సీ నుంచి తప్పించి చివరికి జట్టుకు  దూరం చేశాడు అనే వార్తలు కూడా వినిపించాయి. మెగా వేలంలోకి అతని వదిలేసిన సన్రైజర్స్ యాజమాన్యం మళ్లీ జట్టులోకి తీసుకోలేదు.  దీంతో  సన్రైజర్స్ యాజమాన్యం తప్పుడు నిర్ణయం తీసుకుంది అంటూ ఎంతో మంది అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక ఇప్పుడు అనూహ్య  నిర్ణయం తీసుకున్న సన్రైజర్స్ యాజమాన్యం హెడ్ కోచ్  బాధ్యతలను బ్రియాన్ లారాకు  అప్పగించింది.  దీంతో అతని నేతృత్వంలో సన్రైజర్స్ జట్టు వచ్చే సీజన్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl