మొన్నటి వరకు గాయం కారణంగా తన కెరీర్ లోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇక ఒక సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో కెప్టెన్గా ఆటగాడిగా అదరగొట్టిన హార్దిక్ పాండ్యా ఇక టీమిండియా తరఫున అవకాశం దక్కించుకున్నాడు.  కాగా ఇండియా తరపున కూడా తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు. ఒకవైపు బౌలింగ్లో మరో వైపు బ్యాటింగ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఇక టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే హార్థిక్ పాండ్యా టీమిండియా జట్టులో ఉన్నాడు అంటే చాలు 11 మంది ప్లేయర్లు కాదు ఏకంగా 12 మంది జట్టులో ఉన్నట్లే అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. కాగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్  ఆడబోయే జట్టును బిసిసిఐ  ఇటీవలే ప్రకటన చేసింది. అందరూ అనుకున్నట్లుగానే హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే టి 20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఇటీవల మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ప్రపంచ కప్లో టీమ్ ఇండియాకు హార్దిక్ పాండ్యా ఎంతో కీలకంగా మారబోతున్నాడు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. 1985 ప్రపంచ ఛాంపియన్షిప్లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో  రవి శాస్త్రి టీమిండియా విజయాల్లో ఎంతగానో కీలక పాత్ర వహించాడు.  ఇక ఎప్పుడూ టీ20 ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా నుంచి రవిశాస్త్రి లాంటి ప్రదర్శనలు వచ్చిన  ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. మరికొంత మంది కూడా హార్థిక్ పాండ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: