ప్రస్తుతం ఇండియా మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అందులో భాగంగా మూడు టీ 20 లు మరియు 3 వన్ డే ల సీరిస్ ఆడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇండియా మహిళలు టీ 20 సీరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది. కనీసం వన్ డే సీరీస్ ను అయినా చేజిక్కించుకుని పరువును దక్కించుకుని గర్వంగా స్వదేశానికి వెళ్ళాలని పోరాడుతున్నారు. కాగా నిన్న మొదటి వన్ డే జరిగింది. ఇందులో మొదట టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళలు నిర్విరామంగా వికెట్లు కోల్పోతూ అనుకున్న స్కోర్ ను సాధించలేకపోయింది.

నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి  కేవలం 224 పరుగులు చేసి ఇండియా ముందు సులభమైన లక్ష్యాన్ని ఉంచింది. డేవిడ్ సన్ (50) మరియు డానియల్ వ్యాట్ (43) లు మినహా మరే ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా ఆశించిన మేరకు రాణించలేదు. ఇండియా బౌలర్లు మాత్రం వారిని బాగా అడ్డుకున్నారు... దీప్తి శర్మ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లను దక్కించుకుంది. ఎప్పటి లాగే ఇండియా ఓపెనర్లు స్మృతి మందన్న మరియు షేపాలి వర్మలు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. షెపాలి వర్మ కేవలం ఒక పరుగు చేసి ఔట్ అయింది. ఆ తర్వాత భాటియా (51) తో కలిసిన మందన్న (91) అద్భుతంగా ఆడి ఇండియా విజయంలో  కీలక పాత్ర పోషించింది.

ఇక చివర్లో హర్మన్ ప్రీత్ కౌర్ (74) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అలా ఇండియా మూడు వన్ డే ల సీరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో గెలిచి ఇంగ్లండ్ ను ఒత్తిడిలో నెట్టింది. ఇండియా ప్లేయర్లు ఆట ముందు ఇంగ్లీష్ బౌలర్లు దగ్గర ఎటువంటి సమాధానం లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: