టీ 20 ప్రపంచ కప్ కు ఇంకో మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ ఇండియా అభిమానులలో ఒత్తిడి ఎక్కువ అవుతోంది అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. గతాన్ని సరిగా పరిశీలిస్తే ఇందుకు చాలా కారణాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు ఏమి జరిగింది అంటే... గ్రూప్ స్టేజ్ లో అద్భుతంగా ప్రదర్శన చేసే ఇండియా నాక్ ఔట్ స్టేజ్ లో మాత్రం సాధారణంగా ఆడి ఓటమి చెంది ఇండియా అభిమానుల ఆశలను ఆవిరి చేశారు. మరి కొన్ని సార్లు అయితే కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటని పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు రిసెంటుగా జరిగిన ఆసియా కప్ మరియు గత సంవత్సరం జరిగిన టీ 20 వరల్డ్ కప్ లోనూ నిరాశ పరిచే ప్రదర్శనలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్నారు.

ఈ ఫెయిల్యూర్స్ లలో కొన్ని సార్లు బ్యాటింగ్ వలన, కొని సార్లు బౌలింగ్ వలన దెబ్బతిన్నారు. అయితే ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ పరంగా ఇండియా చాలా బలంగా ఉంది. ప్రత్యేకముగా చెప్పాలంటే కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అతనికి తోడుగా రోహిత్ , రాహుల్ మరియు సూర్య కుమార్ యాదవ్ లు సైతం జట్టుకు విజయాలను అందించడంలో భాగం అవుతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ మరియు పంత్ లతో పటిష్టంగా ఉంది. అయితే ఇక్కడ అందరినీ నిరాపరుస్తున్న విషయం లేదా భయపెడుతున్న విషయం ఇండియా బౌలింగ్ అనే చెప్పాలి.

ప్రస్తుతం వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయిన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, శార్దూల ఠాకూర్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ మరియు యజ్వేంద్ర చాహల్ లు ఉన్నారు. కానీ వీరు అంతా వారి వారి శైలిలో అద్భుతమైన బౌలర్లు అయినప్పటికీ... జట్టు పరిస్థితులను బట్టి పూర్తిగా తేలిపోతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఓవర్ లలో సరిగా బౌలింగ్ చేయక ఆసియా కప్ లో కనీసం ఫైనల్ చేరలేక ఇంటి ముఖం బట్టారు. మరి ఈ వరల్డ్ కప్ లో అయినా అందరూ ఏకధాటిగా ప్రత్యర్థులపై దాడి చేసి ఇండియాకు కప్ ను అందిస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: