వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ విషయంలో కూడా ప్రేక్షకులు అంచనాలు తారుమారు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న టీం లు బాగా  ఆడతాయని  అందరూ అంచనాలు పెట్టుకుంటే ఊహించని రీతిలో పసికూన జట్లు విజయాలు సాధిస్తూ ఉండడం గమనార్హం. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భాగంగా అప్పటికే వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా కొనసాగుతున్న శ్రీలంక అంతర్జాతీయ క్రికెట్లో పసికూన జడ్డుగా ఉన్న నమీబియా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యంగా నమేబియా విజయం సాధించింది.


 అది కూడా శ్రీలంక లాంటి జట్టుపై 53 పరుగులు తేడాతో నమీబియా విజయం సాధించడంతో అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. ఇక ఇటీవల టి20 ప్రపంచ కప్ లో రెండో రోజు మరోసారి ఇలాంటి సంచలనమే నమోదయింది అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో హార్డ్ హిట్టర్లకు మారుపేరు ఆ జట్టు. ఇప్పటికే రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ సొంతం చేసుకొని తన హవా నడిపించింది. తమదైన రోజు ఆ జట్టు ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలుసు. ఆ జట్టు ఏదో కాదు వెస్టిండీస్. అయితే ఇటీవలే ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్  ఘోర పరాజయం పాలయింది.


 అయితే రెండుసార్లు ప్రపంచ కప్ గెలుచుకున్న వెస్టిండీస్ జట్టు పై పసికూన స్కాట్లాండ్ విజయం సాధించడం గమనార్కం.  మ్యాచ్లో తొలత బాటిల్ చేసిన స్కాట్లాండ్ ఐదు వికెట్ల నష్టాలకు 160 పరుగులు చేసింది. కానీ లక్ష్య చేదనలో  వెస్టిండీస్ తడబడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ విభాగం పేక మెడల కూలిపోయింది. 118 పరుగులకే పరిమితమై పసికూన స్కాట్లాండ్ చేతులు ఓడిపోయింది.

 కాగా వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్  పేలవ ప్రదర్శన ఇలా ఉంది : విండీస్ ఓపెనర్లు కైల్ మేయర్స్ (20), ఎవిన్ లూయిస్ (14), బ్రాండన్ కింగ్ (17) పెద్దగా ఆకట్టుకోలేదు. వీరే కాదు కెప్టెన్ నికోలస్ పూరన్ (5), షామ్రా బ్రూక్స్ (4), రావ్‌మెన్ పావెల్ (5), అకీల్ హొస్సేన్ (1), అల్జారీ జోసెఫ్ (0), ఒడియన్ స్మిత్ (5), ఓబెడ్ మెకాయ్ (2 నాటౌట్) పరుగులు మాత్రమే చేయగా.. విండీస్ జట్టులో కేవలం జేసన్ హోల్డర్ (38) కాస్త చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: