ఇటీవల కాలంలో భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి అని చెప్పాలి. బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగి ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన సౌరబ్ గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతాడు అని అందరూ అనుకున్నారు.. కానీ ఊహించని రీతిలో అతను చివరికి పదవి నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టాడు.


 అయితే సౌరబ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇక అటు అన్ని విషయాల్లో కూడా మార్పులు చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు కోచ్గా తన సహచరుడు అయిన రాహుల్ ద్రవిన్ను తీసుకురావడం.. ఇక నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా మరో సహచరుడు వివిఎస్ లక్ష్మన్ ను నియమించడం లాంటివి చేశారు. అదే సమయంలో తన నేతృత్వంలో ప్రత్యేకమైన సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు సౌరబ్ గంగూలీ. అయితే ఇక ఇప్పుడు  గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో  అతని నేతృత్వంలో జరిగిన మార్పులను మరోసారి మార్చేందుకు కొత్త అధ్యక్షుడు సిద్ధమైనట్టు తెలుస్తుంది.


 ఇప్పటికే సౌరవ్ గంగూలీని అధ్యక్షుడిగా తొలగించిన బీసీసీఐ పెద్దలు ఇక ఇప్పుడు అతని హయాంలో ఎంపికైన సెలక్షన్ కమిటీ సభ్యులను కూడా మార్చాలని భావిస్తున్నారు అన్నది తెలుస్తుంది. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ ఆధ్వర్యంలో గంగూలి 2020లో కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేశాడు. ఈ సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మతోపాటు అభయ్ కురివిళ్ళ, దేభాశిష్ మొహంతి లాంటి వారు ఉన్నారు. ఈ క్రమంలోనే చేతన్ శర్మ మినహా మిగతా ఇద్దరినీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ నుంచి తొలగించి కొత్తవారిని ఎంపిక చేయాలని  భావిస్తున్నారట బీసీసీఐ పెద్దలు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: