
అయితే ఇలా ప్రపంచం మొత్తం కోహ్లీ నీ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటూ ఉంటే అటు గౌతమ్ గంభీర్ మాత్రం మరో వాదన వినిపించాడు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అనే విధంగానే మరోసారి తన కామెంట్స్ చేశాడు. కాగా గతంలో విరాట్ కోహ్లీకి, గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2013 సమయంలో గొడవ జరగగా.. ఇక ఇప్పటికీ ఇదే గంభీర్ మనసులో పెట్టుకున్నాడు ఏమో అనిపిస్తూ ఉంటుంది అతని వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. మొన్నటికి మొన్న కోహ్లీ ఫామ్ లో లేనప్పుడు కూడా అతని జట్టు నుంచి పీకేయండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు కోహ్లీ అసలు బెస్ట్ బ్యాటర్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు.
టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ బెస్ట్ ప్లేయర్.. అతనిలా ఎవరూ లేరు అంటూ తెలిపాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మాదిరిగా పవర్ ప్లే లో బ్యాటింగ్ చేసే సదుపాయం సూర్యకుమార్కు లేదు. నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు బౌండరి దగ్గర ఉంటారు.. అలాంటి సమయంలో బౌండరీలు కొట్టడం మామూలు విషయం కాదు. వచ్చి రాగానే సిక్సర్లు కొట్టగల సమర్థుడు సూర్యకుమార్. విరాట్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇలా చేయలేరు. ఇక సూర్యకుమార్ ఒక్కడే మిగతా బ్యాటర్ల పైనుంచి ప్రెషర్ ని తొలగించగలడు. కోహ్లీ మంచి బ్యాటర్ కావచ్చు.. కానీ సూర్య కంటే బెస్ట్ బ్యాటర్ కాదు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు గంభీర్.