పొట్టి ప్రపంచకప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే జరుగుతుంది. కేవలం దిగ్గజ జట్లు మాత్రమే కాదు పసికూన జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఊహించని రీతిలో పోరును కొనసాగిస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ప్రతి మ్యాచ్ కూడా హోరాహోరీగా జరుగుతూ ఇక క్రికెట్ అభిమానులందరని కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో భాగంగా కొంతమంది ఆటగాళ్లు మాత్రం అంచనాలను అందుకోలేక పేలవా ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో నలుగురు స్టార్ ఓపెనర్లు ఉండడం గమనార్హం .. పాకిస్తాన్ నుంచి బాబర్ అజాం, ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, టీమ్ ఇండియా నుంచి కేఎల్ రాహుల్, ఇంగ్లాండ్ నుంచి  బట్లర్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.


 టీమిండియా ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 8 బంతుల్లో నాలుగు పరుగులు.. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో 12 బంతుల్లో 9 పరుగులు.. సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 14 బంతుల్లో 9 పరుగులు చేసి నిరాశపరిచాడు కేఎల్ రాహుల్. ఓపెనర్ గా దంచి కొట్టే  రాహుల్ 3 మ్యాచ్లలో 22 పరుగులే చేశాడు.


 ఇక సెంచరీలు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయే బాబర్ అజాం ఆస్ట్రేలియాలోని బౌన్సి పిచ్ లపై ఆడటానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ గా వెనతిరిగిన బాబర్   జింబాబ్వే తో జరిగిన మ్యాచ్లో 9 బంతుల్లో నాలుగు పరుగులు... నెదర్లాండ్స్ తో మ్యాచ్లో 6 బంతుల్లో నాలుగు పరుగులకు వికెట్ చేజార్చుకుని జట్టును కష్టాల్లో ముంచేసాడు.


 మొన్నటి వరకు సెంచరీల వీరుడుగా పేరు సంపాదించుకున్న జోష్ బట్లర్ సైతం వరుసగా పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లో 18 పరుగులు... ఐర్లాండ్తో మ్యాచ్లో రెండు బంతుల్లో డక్ అవుట్ అయ్యాడు. అయితే ఐర్లాండ్ తో మ్యాచ్లో జోష్ బట్లర్ త్వరగా అవుట్ కావడం కారణంగానే జట్టు ఓడిపోయింది అని చెప్పాలి.


 ఇక ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఓపెనర్ గా కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ సైతం సొంత మైదానాల్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఐదు పరుగులు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.. ఇక ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లోను ఏడు బంతుల్లో మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలా టి20 లో దంచి కొట్టే ఓపెనర్లు ఇప్పుడు వరల్డ్ కప్ లో మాత్రం చేతులెత్తేస్తూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: