ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొనగా ఇక ఆఖరి బంతికి టీమిండియా బౌలర్ అర్షదీప్ ఎలాంటి పరుగులు ఇవ్వకపోవడంతో ఇక భారత జట్టు 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీస్ అవకాశాలను మరింత సులభతరం చేసుకొని  పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉంది భారత జట్టు.


 అయితే ఈ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా అటు ఈ మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీ చేసిన ఫీల్డింగ్  గురించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఏకంగా విరాట్ కోహ్లీ తన చేతిలోకి బంతి రాక పోయినప్పటికీ త్రో విసురుతున్నట్లుగా యాక్షన్ ఇచ్చాడు. దీంతో ఫేక్ ఫీల్డింగ్ చేసి అటు ఆటగాళ్లను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నించాడు అంటూ ఎంతో మంది బంగ్లాదేశ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీటింగ్ చేసి భారత్ గెలిచింది అంటూ ఇక ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి.


 ఇలా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఫేక్ ఫీలింగ్ చేశాడు అంటూ ఏకంగా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ నూరల్ హాసన్ చేసిన ఆరోపణలపై భారత మాజీ బ్యాట్స్మెన్ వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫీల్డ్ లో ఏ ప్లేయర్ అయినా సరే మొదటిసారి అలా చేస్తే అంపైర్లు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ రెండవసారి కూడా అలాంటి తప్పుని పునరావృతం చేస్తే అప్పుడు పెనాల్టీ విధిస్తారు అంటూ వసీం జాఫర్ గుర్తు చేశాడు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: