
తరచూ కెప్టెన్లను మార్చడమే కాదు అటు జట్టులో ఉన్న ఆటగాళ్లను కూడా తరచూ మారుస్తూనే ఉన్నారు బీసీసీఐ సెలెక్టర్లు.. విశ్రాంతి పేరుతో ఇలా జట్టులో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇలా తరచూ మార్పులు చేయడమే అటు టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ ఓడిపోవడానికి కారణమైంది అంటూ కొంతమంది విమర్శలు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇటీవల సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటి ముఖం పట్టిన టీమిండియా ఇక ఇప్పుడు వరుస పర్యటనలకు సిద్ధమవుతుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతుంది అని చెప్పాలి. అక్కడ మూడు మ్యాచ్ల టి20 సిరీస్, మూడు మ్యాచ్లో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో తాత్కాలిక కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేశారు. ఇక వన్డే సిరీస్ కు ఎప్పటిలాగే ధావన్ కెప్టెన్సీ వహించబోతున్నాడు. అదే సమయంలో ఇప్పుడు ఆటగాళ్లకు మాత్రమే కాదు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కి కూడా విశ్రాంతి ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు అని చెప్పాలి.