
టీమిండియాలో అవకాశం దక్కించుకున్న తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఇటీవలే విజయ్ హజారే టోపీలో భాగంగా జరిగిన మ్యాచ్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. ఇటీవల రైల్వేస్, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టు విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర జట్టు 38.2 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా మహారాష్ట్ర కెప్టెన్గా ఉన్న రుతురాజ్ ఏకంగా 123 బంతుల్లో 124 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండడం గమనార్హం.
ఇక ఇతనికి తోడుగా మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 80 బంతుల్లో 75 పరుగులు చేయడంతో ఇక జట్టు ఎంతో అలవోకగా విజయం సాధించింది అని చెప్పాలి. ఇక ఇద్దరి మధ్య తొలి వికెట్ కి 165 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఋతురాజు గైక్వాడ్ ప్రస్తుతం సెంచరీ తో చెలరేగిపోవడంతో అటు మహేంద్రసింగ్ ధోని సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్లేయర్గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే..