
కానీ అటు ఇంగ్లాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన బెన్ స్టోక్స్ ఇక చివరి వరకు ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. అయితే ఫైనల్ మ్యాచ్ జరిగిన సమయంలో అటు స్టేడియంలో ఇంగ్లాండ్ అభిమానుల కంటే పాకిస్తాన్ అభిమానులు ఎక్కువగా కనిపించారు. స్టేడియం మొత్తం ఆకుపచ్చ కలర్ లో మారిపోయింది అని చెప్పాలి. ఇక కొంతమంది అభిమానులు కెమెరాల దృష్టిని ఆకర్షించేందుకు ఆసక్తికరమైన ఫ్లకార్డులు పట్టుకొని దర్శనమిచ్చారు. అయితే ఇక ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఒక వ్యక్తి పట్టుకున్న ప్లకార్డు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..
ఒకవేళ ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ గెలిస్తే గనుక తాను తన భార్యకి డైమండ్ రింగు కొనిస్తాను అంటూ రాసి ఉన్నా ఫ్లకార్డ్ ఒక వ్యక్తి పట్టుకున్నాడు. ఇక పక్కనే అతని భార్య కూడా తన చేతితో ఇక ఆ ఫ్లకార్డ్ ను చూపిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఫైనల్ లో మాత్రం పాకిస్తాన్ ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో తన భర్త నుంచి డైమండ్ రింగ్ బహుమతిగా పొందాలి అనుకున్న సదరు మహిళకు నిరాశ మిగిలింది. ఇక ఈ ప్లకార్డు వైరల్ గా మారిపోవడంతో ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ పాపం ఆ మహిళ డైమండ్ రింగ్ కోల్పోవడంతో ఇక పాకిస్తాన్ ను ఎంత తిట్టుకుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.