ఇటీవల మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో చివరికి ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పై విజయం సాధించి రెండవ సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేన అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో చివరికి ఇంగ్లాండ్ విజయం సాధించింది.  ఒకానొక దశలో పాకిస్తాన్ బౌలర్లు  కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో  పాకిస్తాన్ గెలుస్తుందేమో అని అనిపించినప్పటికీ ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల పోరాట పట్టిన జట్టుకు విజయాన్ని అందించింది అని చెప్పాలి.


 కఠిన సమయంలో వికెట్లు కోల్పోకుండా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసినప్పటికీ ఇక జట్టుకు అవసరమైన కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తక్కువ పరుగులకే కట్టడి చేయడం.. ఇక బౌలింగ్లో పేలవు ప్రదర్శన వల్ల చేతి దాకా వచ్చిన మ్యాచ్ లో ఓడిపోవడంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇలాంటి వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంపై అటు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డెత్ ఓవర్లలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడమే ఇక పాకిస్తాన్ ఓటమికి అసలైన కారణం అంటూ స్టీఫెన్ ఫ్లెమింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 16 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 119 తో ఉన్న సమయంలో పాకిస్తాన్ చివరి 4 ఓవర్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓవర్కు పది పరుగులు చేసిన దాదాపు 160 పరుగులను సాధించేది. మేల్ బోర్ ను క్రికెట్ గ్రౌండ్ పరిస్థితులలో పాకిస్తాన్ జట్టు సరిగా అర్థం చేసుకోలేదు.. సింగిల్స్ డబుల్స్ తీసిన పరిస్థితి మరోలా ఉండేది అంటూ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: