సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లు  సాధించిన రికార్డుల గురించి మాత్రమే మనం ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటామూ. కానీ ఇప్పుడు 16 ఏళ్ల ఒక కుర్రాడి గురించి భారత క్రికెట్లో అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఎందుకంటే పదహారేళ్ళ వయసులోనే ఏకంగా క్రికెట్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసి ఎంతోమంది దిగజాలు సాధించలేనిది అతను సాధించి చూపించాడు అని చెప్పాలి. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్లో ఇటీవల సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.


 కర్ణాటకలోని షిమోగాలో జరిగిన అంతర్ జిల్లా అండర్ -16 టోర్నీ లో ఒక అత్యంత అరుదైన ఘటనరికార్డు నమోదయింది అని చెప్పాలి. బాద్రావతి-  సాగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 16 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఒకే ఒక్కడు 400 పరుగులు బాదాడు. సాగర్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయి మంజునాథ్ 165 బంతుల్లోనే 48 పౌర్లు 24 సిక్సర్ల సహాయంతో 407 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఫలితంగా సాగర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. కలలో కూడా ఊహించని అతిపెద్ద లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన భద్రావతి జట్టు 73 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక ఈ మ్యాచ్లో 4 పరుగులతో చెలరేగిన తన్మయ్ మంజునాథ్  50 ఓవర్ల ఫార్మాట్లో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడు.



 అంతర్జాతీయ వన్డేలలో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు  తన ఖాతాలో వేసుకున్న హిట్ మాన్ శ్రీలంక పై 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. ఇక అంతర్జాతీయ వన్డేలలో ఇదే ఇప్పటివరకు అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అయితే లిస్ట్ ఏ క్రికెట్ క్రికెట్ కూడా కలుపుకుంటే సర్రే - గ్లామర్ఖాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏడి బ్రౌన్ 268 పరుగులు సాధించాడు. ఇక ఇప్పుడు ఒకే ఒక్కడు తన్మయ్ మంజునాథ్ 165 బంతుల్లో 407 పరుగులు చేయడంతో అందరూ అతని గురించి చర్చించుకుంటున్నారు. టీమిండియా ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: