ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఎంతో మంది భారత యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ ఉన్నారు అని చెప్పాలి. తమ అద్భుతమైన ప్రదర్శనతో తామే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని అందరికీ నిరూపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక విజయ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ప్రతి మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లు సెంచరీ తో చెలరేగిపోతున్న తీరు ప్రతి ఒకరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది.


 ఇకపోతే ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై, మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా భారీ స్కోరు నమోదు చేయడం గమనార్హం. అయితే హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ముంబై జట్టు ఓపెనర్ యశస్వి జైష్వాల్ ఏకంగా అదిరిపోయే సెంచరీ తో ఆకట్టుకున్నప్పటికీ అతని సెంచరీ వృధా అయ్యింది అని చెప్పాలి. 135 బంతుల్లో 14 ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో 142 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్.


 ఇలా జట్టును గెలిపించేందుకు యశస్వి జైష్వాల్ విరోచితమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది అని చెప్పాలి. యశస్వి జైశ్వాల్ మినహా మిగతావారు విఫలం కావడంతో 49 ఓవర్లలో 321 పరుగులకే ఆల్ అవుట్ అయింది ముంబై జట్టు. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 342 పరుగులు భారీ స్కోరు చేయడం గమనార్హం. ఇందులో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 137 బంతుల్లో 156 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో యువ ప్లేయర్ పవన్ షా 84 పరుగులు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: