గత కొంతకాలం నుంచి బౌలర్లపై ప్రతాపం చూపిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఇక ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో కూడా మరోసారి ఇదే చేసి చూపించాడు అని చెప్పాలి. ఇక వచ్చి రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయే సూర్య కుమార్ యాదవ్ ఇక న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో కూడా ఇదే పంథా తో బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక అతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి అంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.


 ఇకపోతే టి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్కు ఇక ఇది రెండవ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. అంతకుముందు ఏకంగా పటిష్టమైన ఇంగ్లాండు జట్టు పైన తన మొదటి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు సూర్య కుమార్ యాదవ్.  ఇక ఈ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు 65 పరుగులు తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే సెంచరీ తో చెలరేగిపోయిన సూర్య కుమార్ యాదవ్ ఒక అరుదైన రికార్డును తన పేరున లికించుకున్నాడు అని చెప్పాలి. అంతర్జాతీయ టి20 లో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక 50 ప్లస్ స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు.


 ఇప్పుడు వరకు సూర్యకుమార్ ఈ ఏడాదిలో 11 సార్లు 50 ప్లస్ స్కోర్ లో సాధించాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడువరకు ఈ రికార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం పేరుతో ఉండేది. బాబర్ ఒక క్యాలెండర్ ఇయర్ లో పది 50 ప్లస్ స్కోర్ లు సాధించి రికార్డు సృష్టించగా.. ఇక ఇప్పుడు రికార్డును బ్రేక్ చేశాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2021 క్యాలెండర్ ఇయర్ లో 13 సార్లు 50 ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు మహమ్మద్ రిజ్వాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: