ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కి గత కొన్ని సీజన్స్ నుంచి మాత్రం ఊహించని రీతిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఈ జట్టు కనీస ప్రదర్శన చేయలేక అభిమానులు అందరిని నిరాశ పరుస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో అయితే ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడకపోవడమే బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే అంత దారుణమైన ప్రదర్శన చేసి లీగ్ దశతోనే ప్రస్థానాన్ని ముగించింది అని చెప్పాలి.


 అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక 2023 ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలిచి మరోసారి తమ హవా నడిపించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. అయితే ఇటీవల బీసీసీఐ 2023 ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్  ప్రక్రియ నిర్వహించగా..  ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ 8 మంది ఆటగాళ్ళను వదులుకుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక ఇలా రిటెన్షన్ ప్రక్రియలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను బ్యాడ్ లక్ వెంటాడింది అన్నది తెలుస్తుంది.


 ప్రస్తుతం దేశవాళి టోర్నీ అయిన విజయ హజారే ట్రోఫీలో భాగంగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ వరుస సెంచరీలతో రికార్డులను అన్నింటిని  చెరిపేస్తున్న  జగదీషన్ ని ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాకొద్దు అంటూ వదులుకుంది  అయితే అతను తమిళనాడు ఆటగాడు కావడం.. దేశాలు రాసిస్తుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ 2018 లోనే జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అతను అరంగేట్రం చేసింది  మాత్రం 2020 సీజన్లో అని చెప్పాలి. బేస్ ప్రైస్ 20 లక్షలకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఇటీవల మంచి ప్రదర్శన చేయడం లేదని వదులుకుంది. కానీ విజయ్ హజారే ట్రోఫీలో అతని ప్రదర్శన చూసిన తర్వాత మాత్రం ఇక ఈ ఏడాది వేలంలో అతనికి భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk