ప్రస్తుతం లిస్ట్ ఏ క్రికెట్లో భాగంగా జరుగుతున్న దేశవాళి టోర్ని విజయ హజారే ట్రోఫీలో భాగంగా ఎన్నో సంచలనాలు నమోదు అవుతూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది యువ బ్యాట్స్మెన్లు అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగిపోతూ ఉన్న నేపథ్యంలో ఇక ఇప్పటివరకు ప్రపంచకప్ క్రికెట్లో ఉన్న ఎన్నో రికార్డులు బద్దలు అవుతున్నాయి. ఇక విజయ హజారే వన్డే ట్రోఫీలో ఒకవైపు బౌలర్లు మరోవైపు బ్యాట్స్మెన్లు కూడా అద్భుతంగా రాణిస్తూ తామే ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నారు అని చెప్పాలి..


 ఇకపోతే ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సంచలన రికార్డు నమోదయింది అని చెప్పాలి. కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ లిస్టు ఏ క్రికెట్లో ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ రికార్డును సృష్టించారు తమిళనాడు ఆటగాళ్లు. ఇటీవల విజయ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు ఏకంగా 506 పరుగులు చేసింది అన్న విషయం తెలిసిందే. ఇందులో నారాయణ జగదీషన్ ఏకంగా 277 పరుగులతో ఆకట్టుకున్నాడు.



 అయితే ఆ తర్వాత అసాధ్యమైన లక్ష్యం తో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరికి 71 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే తమిళనాడు బౌలర్లలో సిద్ధార్థ్ 5 వికెట్లతో చెలరేగి అటు అరుణాచల్ ప్రదేశ్ ను దెబ్బ కొట్టాడు. దీంతో తమిళనాడు జట్టు 435 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ప్రపంచ క్రికెట్లో లిస్ట్ ఏ స్టేజ్ లో అత్యధిక రన్స్ తేడాతో గెలిచిన జట్టుగా తమిళనాడు రికార్డ్ సృష్టించింది. సెకండ్ ప్లేస్ లో సోమార్సెట్ 246 పరుగులు తేడాతో గెలిచిన జట్టుగా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: