ప్రస్తుతం దేశవాళి టోర్ని అయినా విజయ హజారే ట్రోఫీ క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతలా ఎంటర్టైన్మెంట్ పంచుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా క్రికెట్ ప్రేక్షకులు దేశవాలి టోర్ని లను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఎంతో మంది ప్రేక్షకులు మాత్రం ఇక ఇటీవల కాలంలో విజయ హాజరే ట్రోఫీ లో యువ ఆటగాళ్లు అద్భుతమైన సత్తా చాటుతున్న తీరు చూస్తూ ఉంటే ఎలాగైనా విజయ హజారే ట్రోఫీ వీక్షించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.


 ఏకంగా ఒక మ్యాచ్ అద్భుతంగా జరిగింది అనుకునే లోపే ఇంకో మ్యాచ్ అంతకుమించి అనే రేంజ్ లోనే జరుగుతోంది. ఇలా ఒక మ్యాచ్ కు మించి మరో మ్యాచ్ జరుగుతూ ఉండడం.. ఇక ఒక ఆటగాడికి మించి మరో ఆటగాడు సెంచరీలతో చెలరేగిపోతూ ఉండడం విజయ్ హజారే ట్రోఫీలో ప్రతి మ్యాచ్లో కూడా జరుగుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఏకంగా విజయ్ హజారే ట్రోఫీ ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు చేస్తూ అదరగొట్టాడు తమిళనాడు క్రికెటర్ నారాయణ జగదీషన్. ఈ క్రమంలోనే ఒకే సీజన్లో 4 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవలే విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేసి ఇక విజయ్ హజారే ట్రోఫీలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఏకంగా ఒకే సీజన్లో 5 సెంచరీలు చేసి తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 277 పరుగులు చేశాడు నారాయణ జగదీషన్. దీంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ యువ ఆటగాడి విధ్వంసం గురించి చర్చించుకుంటుంది. అతడే ఫ్యూచర్ స్టార్  అని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభివర్ణిస్తున్నారు. కాగా నారాయన్ జగదీషన్ ఇక ఇటీవల వేలంలోకి వదిలేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: