దేశవాళీ వన్ డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోపీ 2022 - 2023 వ సీజన్ ఈ రోజు సౌరాష్ట్ర మరియు మహారాష్ట్రల మధ్యన జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. మూడు వారాల నుండి ఈ టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ మాజీ ఛాంపియన్ లకు ఈ టోర్నీలో చిన్న జట్లు షాక్ ఇవ్వడంతో టైటిల్ బరిలో నిలవలేకపోయాయి. ముంబై, కర్ణాటక, తమిళనాడు , బెంగాల్, ఢిల్లీ లాంటి జట్లు ఈసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. సెమీస్ కు చేరిన జట్లలో అస్సాం, సౌరాష్ట్ర , మహారాష్ట్ర మరియు కర్ణాటక జట్లు ఉన్నాయి. ఇపుడు ఫైనల్ లో ట్రోపీ కోసం మహారాష్ట్ర మరియు సౌరాష్ట్ర జట్లు అహ్మదాబాద్ లోనే నరేంద్ర మోదీ స్టేడియం లో పోటీ పడుతున్నాయి.

మొదట టాస్ గెలిచిన సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ మహారాష్ట్రను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే మహారాష్ట్ర ఇన్నింగ్స్ మొదటి నుండి నత్త నడకన సాగింది. ఫైనల్ అని మరిచిపోయారా ఏమో తెలియదు కానీ.. దాదాపుగా 30 ఓవర్ల వరకు టెస్ట్ ఇన్నింగ్స్ లాగా ఆడారు. ఒకవైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ మరియు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. ఈ టోర్నీలో కేవలం అయిదవ మ్యాచ్ మాత్రమే ఆడిన రుతురాజ్ గైక్వాడ్ పరుగుల వరద పారించాడు. మరుసగా మరో సెంచరీ సాధించి ఇండియా సెలెక్టర్లను సందిగ్ధంలో పడేశాడు. గ్రౌండ్ కు నాలుగు వైపులా అలవోకగా షాట్ లు ఆడుతూ ఈ సీజన్ లో వరుసగా మూడవ సెంచరీ (108) సాధిచాడు.

ప్రస్తుతం ఈ సీజన్ టాప్ స్కోరర్ లిస్ట్ లో 660 పరుగులతో టాప్ లో నిలిచాడు. ఇతని కన్నా ముందు తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ 830 పరుగులు చేశాడు. వాస్తవానికి మహారాష్ట్ర కనీసం పరుగులు అయినా చేయాల్సింది. కానీ ఆఖరి ఓవర్ లలో ఒక్క సరిగా హిట్టింగ్ స్టార్ట్ చేయడంతో వరుస వికెట్లను కోల్పోయి కేవలం 248 పరుగులకే పరిమితం అయింది. మరి ఈ స్కోర్ ను సౌరాష్ట్ర సాధించి టైటిల్ ను ఎగరేసుకుపోతుందా లేదా అన్నది తెలియాలంటే ఛేజింగ్ వరకు ఆగాల్సిందే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: