ప్రస్తుతం ఫుడ్ బాల్ ఆటలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు క్రిస్టియానో రోనాల్డో. పోర్చుగల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకవైపు తన కెప్టెన్సీ వ్యూహాలతో కూడా జట్టుకు విజయాలను అందిస్తూ.. ఇక పోర్చుగల్ ను మేటిజట్టుగా మార్చేశాడు అని చెప్పాలి. ఇక పోర్చుగల్ జట్టుతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్ధులు సైతం వణికి పోయే విధంగా క్రిస్టియన్ రోనాల్డో తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. తన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 అలాంటి క్రిష్టియానో రోనాల్డో కి ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఊహించని అవమానం జరిగింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఇక జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న క్రిస్టియనో రోనాల్డోని బెంచ్ స్ట్రెంత్ కి పరిమితం చేసింది జట్టు యాజమాన్యం  దీంతో అభిమానులందరూ కూడా షాక్ అయ్యారు. ఇటీవల స్విజర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డోని బెంచ్ పై కూర్చోబెట్టి అతని స్థానంలో 18 ఏళ్ల యువ ఆటగాడికి ఛాన్స్ ఇచ్చింది జట్టు యాజమాన్యం.

 దీంతో ఇది నిజంగా క్రిస్టియానో రోనాల్డోని అవమానించడమే అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక ఇటీవల రొనాల్డో తన పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు అన్నది తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్ కి డుమ్మా కొట్టాడు   యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేక చివరికి జిమ్ లోనే సమయం గడిపాడట. అయితే ఇటీవల స్విజర్లాండ్ పై పోర్చుగల్  విజయం సాధించినప్పటికీ అటు ఎలాంటి సంబరాలు చేసుకోకుండా రోనాల్డో మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు అన్న విషయం తెలిసిందే  ఇక తర్వాత మ్యాచ్లో కూడా రోనాల్డో ఆడే ఛాన్స్ తక్కువ అని కోచ్ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: