గత కొంతకాలం నుంచి సీనియర్లు జట్టులో ఉన్న నేపథ్యంలో  కేవలం అడపాదడప అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్నాడు ఇషాన్ కిషన్. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం ఒడిసి పట్టుకొని ఇక మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇషాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సైతం అంచనా వేశారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల తనలో దాగి ఉన్న ప్రతిభని  నిరూపించి ఏకంగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపున తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి.

 ఏకంగా ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ తో చలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా ఏకంగా మూడు వన్డే మ్యాచ్ లలో వీర విహారం చేశాడు అని చెప్పాలి. బంగ్లాదేశ్ బౌలర్లు ఎక్కడ బంతివేసినా కూడా దానిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇషాన్ కిషన్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. ఏకంగా 126 బంతుల్లోనే ఇషాన్ కిషన్  డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు అంటే ఇక అతని విధ్వంసం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.



 ఇలా మెరుపు ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఇషాన్ కిషన్. అయితే అంతకుముందు వెస్టిండీస్ దిగ్గజం అయిన క్రిస్ గేల్ పేరిట ఈ రికార్డు ఉండేది. 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు గేల్. కానీ ఇప్పుడు ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే విధ్వంసం సృష్టించి డబుల్ సెంచరీ మార్కులు అందుకున్నాడు. అంతేకాదు వన్డే ఫార్మాట్లో  డబుల్ సెంచరీ చేసిన అతిపిన్నవయస్కుడిగా కూడా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు విదేశాల్లో డబుల్ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: