ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు బెన్ స్టోక్స్. ఇక మంచి ఫామ్ లో కొనసాగుతూ ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికీ మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక జట్టును విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర వహించాడు. ఒకవైపు మిగతా బ్యాట్స్మెన్లందరూ కూడా పరుగులు చేయలేక వికెట్లు కోల్పోతున్న సమయంలో బెన్ స్టోక్స్ మాత్రం పాకిస్తాన్ బలమైన బౌలింగ్ ను ఎదుర్కొంటూ నిలబడ్డాడు అని చెప్పాలి. చివరి వరకు పోరాడి చివరికి జట్టుకు విజయాన్ని అందించాడు.


 ఇలా బెన్ స్టోక్స్ తన అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్ కప్ హీరోగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ మరోవైపు జట్టును కూడా ఎంతో అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు జీవంలేని పాకిస్తాన్ పిచ్ లపై పరుగుల వరద ఎలా పారిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..


 అద్భుతమైన బ్యాటింగ్ తో  ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటీవల ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా న్యూజిలాండ్ దిగ్గజా ఆటగాడు మేకళ్లమ్ రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. కాగా మేకల్లమ్ అతని కెరియర్ లో 176 ఇన్నింగ్స్ లో 107 సిక్సర్లు కొడితే.. బెన్ స్టోక్స్ 160 ఇన్నింగ్స్ లోనే 107 సిక్సర్ల మార్క్ నూ అందుకున్నాడు. పాకిస్తాన్తో జరిగిన రెండవ టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ ఇక ఈ మైలు రాయిని అందుకున్నాడు అని చెప్పాలి. దీంతో అభిమానులు అందరూ అతనూ సాధించిన రికార్డు పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: