సంజూ శాంసన్ కు సంబంధించిన వార్తలు గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో తెగ కనిపిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సంజూ శాంసన్ ఎంతో టాలెంట్ ఉన్న ప్లేయర్ అయినప్పటికీ కూడా అతనికి టీమిండియాలో మాత్రం సరైన అవకాశాలు దక్కడం లేదని ఎంతో మంది అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేలవమైన ప్రదర్శన చేస్తున్న కొంతమంది ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సంజు  లాంటి టాలెంటెడ్ ప్లేయర్ని ఎందుకు పక్కన పెడుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్ళు సైతం వెంటనే సంజు శాంసన్ కి  టీమిండియా జట్టులో అవకాశం కల్పించాలని.. ఒక ఆటగాడి విషయంలో ఇంతటి వివక్ష తగదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇలా సంజూ శాంసన్ అవకాశాలు ఇవ్వకపోవడంతో అతని అభిమానులు అందరూ కూడా బహిరంగంగానే నిరసనలు చేపట్టిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు సంజూ శాంసంగ్ కు సంబంధించి ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా భారత ఆటగాడు అయిన సంజూకు ఐర్లాండ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది.


 ఇండియా తరఫున ఆడేందుకు అవకాశాలు దక్కని సంజూకు ఐర్లాండ్ తమ దేశం తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలి అంటూ కబురు పంపినట్లు ఇటీవల ఇన్సైడ్ స్పోర్ట్స్ తెలిపింది. ఇక అన్ని వదిలేసుకుని వస్తే అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే సంజూ  మాత్రం ఇక ఈ ఆఫర్ ను తిరస్కరించాడు అన్నది తెలుస్తుంది. 2015లో భారత జట్టులోకి వచ్చి అంతర్జాతీయ కెరియర్ ప్రారంభించిన సంజు శాంసన్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్ లలో కలిపి 27 మ్యాచులు మాత్రమే ఆడాడు అంటే అతన్ని సెలెక్టర్లు ఎంతలా పక్కన పెడుతూ ఉన్నారు అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: