2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన మినీ వేలం ప్రక్రియ నేడు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరి కళ్ళు కూడా ప్రస్తుతం మినీ వేలంలో ఉన్న స్టార్ ఆటగాళ్ల మీదే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఆయా ఫ్రాంచైజీలు  ప్రతిభ గల ఆటగాళ్లను   ఇక జట్టులోకి తీసుకొని తమ జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకునేందుకు ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయ్. కాగా నేడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు కొచ్చి వేదికగా ఈ మిని వేలం ప్రారంభం కాబోతుంది.


 అయితే మినీ వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్ది ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఈ వేలంపై తమ రివ్యూలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఏ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది.. ఎంత మొత్తంలో ధర వెచ్చిస్తుంది అన్న విషయంపై రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడి కెప్టెన్సీ వహించిన మయాంక్ అగర్వాల్ ఇక ఇప్పుడు మినీ వేలంలో పోటీ పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది బ్యాటింగ్లో విఫలం కావడంతో ఆ ఫ్రాంచైజీ  అతడిని విడిచిపెట్టింది.


 ఈ క్రమంలోనే రెండు కోట్ల బేస్ ప్రైస్ తో మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం మినీ వేలంలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మయాంక్ అగర్వాల్ గురించి మినీ వేలంలో రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వేలం జాబితాలో మయాంక్ అగర్వాల్ ను 5వ స్థానంలో ఉంచుతున్నాను. అతడిని తీసుకోకపోవడానికి కారణం ఏమైనా ఉంది అంటే చాలా జట్లు ఓపెనర్ లేదా టాప్ పాత్ర బ్యాట్స్మెన్ అవసరం లేదు.


 ఇది తప్ప మయాంక్ అగర్వాల్ కి వ్యతిరేకంగా ఇంకేది లేదు అని చెప్పాలి. కాబట్టి గుజరాత్ అతని కొనేందుకు ఆసక్తి చూపవచ్చు. ఎందుకంటే వారికి శుభమన్ గిల్ ఉన్నాడు. అతనికి తోడు మరో ఓపనర్ మయాంక్ అగర్వాల్ ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. మరోపక్క సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా తమ వద్ద ఉన్న సొమ్ముతో ఇక విధ్వంసకర బ్యాట్స్మెన్ ల కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇప్పటికే బౌలింగ్ బలంగానే ఉంది. కాబట్టి ఇక బ్యాటర్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వేలంలో పెద్దగా పోటీ లేకపోతే మాత్రం మయాంక్ అగర్వాల్ కోసం 8 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు సన్రైజర్స్ సిద్ధంగా ఉండే అవకాశం ఉంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: