
దీంతో మళ్లీ కెప్టెన్సీ ని ధోనీకి అప్పగిస్తూ జడేజా నిర్ణయం తీసుకున్నాడు. అయితే ధోని ఒకవేళ ఐపిఎల్ ఆడిన ఇదే చివరి సీజన్ అని ఎంతో మంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు అన్న విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త కెప్టెన్ దొరికేశాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం ప్రక్రియ జరిగింది అని చెప్పాలి. ఇక ఈ వేలంలో భాగంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్లకు దక్కించుకుంది.
కాగా చివరిసారి అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లో బరిలోకి దిగాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి ఒక మంచి సత్తా ఉన్న కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఇదే మంచి అవకాశం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే కెప్టెన్గా అపారమైన అనుభవం ఉన్న బెన్ స్టోక్స్ ని భారీ ధర వెచ్చింది జట్టులోకి కొనుగోలు చేసింది. ఇక మెల్లమెల్లగా అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ కూడా ఉంది అని తెలుస్తుంది.