ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్ల కంటే పటిష్టమైన జట్టుగాను కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు బ్యాటింగ్ విభాగంలో మరోవైపు బౌలింగ్ విభాగంలో ఇక ముంబై ఇండియన్స్ కి ఎవరు సాటిరారు అని చెప్పాలి. అయితే అలాంటి ముంబై ఇండియన్స్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అని చెప్పాలి. ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్ గా బలిలోకి దిగింది రోహిత్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు.


 కానీ ఎక్కడ ఛాంపియన్ జట్టు లాగా ప్రదర్శన మాత్రం చేయలేక పోయింది అని చెప్పాలి. వరుసగా ఓటములు చవి చూస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఇక జట్టులో ఉన్న ఏ ఆటగాడు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు అని చెప్పాలి. దీంతో కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టకుండానే ఇక ఇంటి బాట పట్టింది  ముంబై ఇండియన్స్ జట్టు. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఎంతోమంది ఆటగాళ్ళకు  జట్టు నుంచి ఉద్వాసన పలికి ఇక కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఇప్పుడు మరింత పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఈసారి ముంబై ఇండియన్స్ కు తిరుగే ఉండదు అని అభిమానులు సైతం భావిస్తున్నారు.


 కాగా ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ మునుపేన్నడు లేనంత పటిష్టంగా ఇప్పుడు కనిపిస్తుంది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్,  సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, బ్రేవిస్, స్టబ్స్, తిలక్ వర్మ, కామరూన్ గ్రీన్ లాంటి హిట్టర్లు ఉన్నారు. వీరు కాస్త క్రీజులో కుదురుకున్నారంటే వీరిని ఆపడం ఎవరి తరము కాదు. ఇక బౌలింగ్లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫేస్ అటాక్ ముంబై సొంతం అయింది ఇప్పటికే బుమ్రా ఉండగా ఇక ఆర్చర్ సైతం గాయం నుంచి కోలుకొని వచ్చేసాడు. మరోవైపు రిచర్డ్ సన్, అనుభవజ్ఞుడైన స్పిన్నర్ పియూస్ చావ్లా కూడా ఉండడంతో ఇక 2023 ఐపీఎల్ సీజన్లో ముంబైని ఎదుర్కోవడం ప్రత్యార్థులకు పెను సవాలు లాంటిది అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl