ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడిగా కొనసాగుతున్నాడు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ. అయితే ఇప్పుడు వరకు ఎన్నో సార్లు పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడు అనే విషయం తెలిసిందే. అయితే సౌరబ్ గంగూలీ  కేవలం పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా ఏకంగా భారత క్రికెట్లో అత్యున్నతమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి చైర్మన్గా కూడా పదవి బాధ్యతలు చేపట్టాడు అని చెప్పాలి.

 అయితే రెండవసారి కూడా సౌరబ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతాడని అందరూ భావించారు. కానీ ఊహించిన విధంగా అటు సౌరబ్ గంగూలి బీసీసీఐ అధ్యక్ష పదవిని దక్కించుకోలేక పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  బిసిసిఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ వచ్చాడు. అయితే బిసిసిఐ అధ్యక్ష పదవి పోయిన తర్వాత మళ్లీ పశ్చిమ బెంగాల్ క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మారెందుకు అటు సౌరబ్ గంగూలీకి ఛాన్స్ వచ్చినప్పటికీ తన సోదరుడు కోసం ఇక అవకాశాన్ని కూడా వదులుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత సౌరబ్ గంగూలీ మరో కీలక బాధ్యత చేపట్టేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది.


 ఈ క్రమం లోనే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీని మళ్లీ స్టేడియం లో చూసేందుకు అవకాశం లభించింది. తన పదవీకాలం ముగిసిన తర్వాత సైలెంట్ గా ఉన్న గంగులిని ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్గా నియమితులయ్యాడు. రికీ పాంటింగ్ తో కలిసి సౌరవ్ గంగూలీ  ఢిల్లీ క్యాపిటల్స్ టీం గెలుపు కోసం పని చేయబోతున్నాడు అని చెప్పాలి. 2019 నుంచి సౌరబ్ గంగూలీ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అడ్వైజర్ గా ఉండగా ఇక ఇప్పుడు ఏకంగా క్రికెట్ డైరెక్టర్గా నియమితులు అయ్యాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: