
ఇలా కొత్త ఏడాదిని ఎంతో అద్భుతమైన విజయంతో ప్రారంభించిన టీమ్ ఇండియా జట్టు ఇక ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఇక ఈ వన్డే సిరీస్ లో భాగంగా సీనియర్లు మళ్ళీ జట్టుతో కలుస్తారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోనే బరిలోకి దిగుతుంది జట్టు. కాగా జనవరి 10 నుండి 3 వన్డే మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇలా ఇక జనవరి 10వ తేదీన జరగబోయే మొదటి వన్డే మ్యాచ్ రోజు ఏకంగా స్కూళ్లకు సెలవు ప్రకటించడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
మొదటి వన్డే మ్యాచ్ గువ హాటి లోని అస్సాం క్రికెటర్ అసోసియేషన్ స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే మంగళవారం రోజున కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో ఒక్క పూట సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే స్కూల్ ల తోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తించనుంది అని చెప్పాలి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాచ్ జరిగే రోజు మధ్యాహ్నం నుంచి కూడా స్కూళ్లు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నారు అనేది తెలుస్తుంది.