మొన్నటి వరకు దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు విరాట్ కోహ్లీ. అయితే అప్పటికే అతను అంతర్జాతీయ క్రికెట్లో ఎంత నిరూపించుకోవాలో అంతకంటే ఎక్కువ నిరూపించుకున్నాడు అని చెప్పాలి. అయినప్పటికీ అతను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన నేపథ్యంలో అతనిపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు వరకు కూడా టీమిండియాని గెలిపించేందుకు అతను చేసిన విరోచమైన పోరాటాన్ని ఎవరు గుర్తు చేసుకోలేదు.. కేవలం అప్పటి ఫామ్ మాత్రమే పరిగణలోకి తీసుకొని విరాట్ కోహ్లీని ఏకంగా జట్టు నుంచి తప్పించాలి అంటూ డిమాండ్లు కూడా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.


 ఇలాంటి ఎన్నో విమర్శలు వచ్చిన పట్టించుకోని విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి ఫామ్ ను అందుకున్నాడు.  ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మునిపటి ఫామ్ అందుకుని  మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఎప్పటిలాగానే మళ్ళీ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడని చెప్పాలి.  అయితే మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్లో సెంచరీ తో చెలరేగిన కోహ్లీ.. ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో సైతం సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్ లోనే కోహ్లీ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది.



 ఈ క్రమంలోనే వన్డే మ్యాచ్లో టీమిండియా కోహ్లీ సెంచరీ చేయడం కాదు అర్థ సెంచరీ పూర్తి చేసిన సమయంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ కేవలం 257 ఇన్నింగ్స్ లోనే 12500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీని బట్టి ఇక సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ 310 ఇన్నింగ్స్ లలో 12500 పరుగులు పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత రికీ పాంటింగ్ 325 మ్యాచ్లలో 12500 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా 12,500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: