విరాట్ కోహ్లీ.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్ అన్న విధంగానే ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అతను హవా నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.  అతను భారత జట్టులోకి అరంగేట్రం చేసి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతుంది. ఇప్పటివరకు అతను సాధించిన రికార్డులు కూడా ఆధ్యాద్భుతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇప్పటికి ప్రతి మ్యాచ్లో అప్పుడే అంతర్జాతీయ జట్టులోకి వచ్చి తనను తాను నిరూపించుకోవాల్సిన ఆటగాడు ఎంత కసితో కనిపిస్తాడో ఇక విరాట్ కోహ్లీ ఇప్పటికీ కూడా అంతే కసితో ఆడుతూ ఉంటాడు అని చెప్పాలి.


 ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని సెంచరీలు బాదిన.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిన ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్న విధంగానే ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతూ ఉంటాడు. ఫార్మాట్ ఏదైతే నాకేంటినా బ్యాటింగ్ తో  ప్రత్యర్ధులకు వణుకు పుట్టించటమే నా టార్గెట్ అన్న విధంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి కూడా వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు విరాట్ కోహ్లీ. ఏకంగా తన కెరియర్లో ఇప్పటివరకు 73 అంతర్జాతీయ సెంచరీలను సాధించాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఏకంగా అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మరో సెంచరీ తో చెలరేగిపోయాడు. తద్వారా ఇక వన్డే ఫార్మాట్లో 45 సెంచరీలు చేసాడు. కాగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్లో ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు కలిపి 45 సెంచరీలు  చేయగలమని ఊహించడం కూడా కష్టం. కానీ విరాట్ కోహ్లీ కేవలం వన్డేలోనే ఈ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ లాగా మూడు ఫార్మట్లలో కలిపి 73 సెంచరీలు చేయడం ఇప్పుడున్న వారికి అసాధ్యం అని చెప్పాలి. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే వన్డే ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించడం ఖాయం అంటూ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: