గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీ సెంచరీలతో ఎలా చలరేగిపోతూ ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. అయితే అప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు సాధించినప్పటికీ విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్న సమయంలో అభిమానులు సైతం అతనిపై విమర్శలు చేసిన పరిస్థితిని కూడా చూశాం. అయితే ఇక ఇలాంటి గడ్డ పరిస్థితి నుంచి బయటపడిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మళ్ళీ మన మునుపటి ఫామ్ను అందుకొని తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు అని చెప్పాలి.


 ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు అంటే చాలు సెంచరీ చేయడం ఖాయం అనే విధంగానే ప్రస్తుతం తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా విరాట్ కోహ్లీ రోజుల వ్యవధిలోనే రెండు సెంచరీలు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ముఖ్యంగా మూడో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ  సృష్టించిన బ్యాటింగ్ విధ్వంసం గురించి ఇప్పటికి కూడా క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు.


 ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విధ్వంసం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తూ ఉండగా.. ఇదే విషయంపై అటు దిగ్గజా క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. మరో ఐదు నుంచి ఆరేళ్ల పాటు విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడితే మాత్రం 100 సెంచరీలను ఎంతో అలవోకగా సాధించగలడు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లీ ప్రతి ఏటా ఆరు సెంచరీలు చేయడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన చూస్తే విరాట్ కోహ్లీ 40 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి సులువుగా మరో 26 సెంచరీలు చేయగలడు. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా 40 ఏళ్ళ వరకు క్రికెట్ ఆడాడు అంటూ గుర్తు చేశాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: