టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో కేఎల్ రాహుల్ డేటింగ్ లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఎన్నో రోజులపాటు తమ ప్రేమతో వార్తల్లో మునిగి తేలిన ఈ జంట ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 పెద్దల అంగీకారంతో ఇక ఇద్దరు తమ ప్రేమకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం పెల్లి నేపథ్యంలో బీసీసీఐ పర్మిషన్తో అటు కేఎల్ రాహుల్ లీవ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న వరుస సిరీస్ లకు కూడా దూరంగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఈనెల 23వ తేదీన కేఎల్ రాహుల్ అతియా వివాహం జరగబోతుంది అని చెప్పాలి. కాగా జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు ఇక వివాహ వేడుక నిర్వహించేందుకు ఇక ఇరు వర్గాలు కూడా సిద్ధమయ్యాయి.  ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.



 ఫ్లాష్ ఫాలి హిల్ లోని సందు ప్యాలెస్ లైట్లతో వెలిగిపోతున్న దృశ్యాలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి కాండాల ఫామ్ హౌస్ లో కూడా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన సందడి మొదలైంది అన్నది తెలుస్తుంది. కేవలం కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే కేఎల్ రాహుల్ అతియా శెట్టి వివాహం పెళ్లివివాహం జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఇక వీరి పెళ్లి కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయబడిన ప్యాలెస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుండగా.. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: