సాధారణంగా జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న వ్యక్తి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంపై పూర్తి క్లారిటీతో ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి క్లారిటీ ఉన్నప్పుడే జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించగలరు. అయితే కొన్ని కొన్ని సార్లు సక్సెస్ఫుల్ సారధులు సైతం ఇక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురవుతూ ఉంటారు అని చెప్పాలి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి తడబాటుకు గురైన పర్వాలేదు కానీ టాస్ వేసే సమయంలో మాత్రం క్లారిటీ తప్పనిసరి అని చెప్పాలి.


 టాస్ గెలిచిన వారికి ఫీలింగ్ లేదా బ్యాటింగ్ ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఒకవేళ టాస్ గెలిస్తే ఏది ఎంచుకోవాలి అనే విషయంపై దాదాపు కెప్టెన్లు ముందుగానే అన్ని చర్చించుకుని ఒక క్లారిటీతో మైదానంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే టాస్ నెగ్గగానే తాము ఏమి ఎంచుకుంటున్నాము అన్న విషయాలను చెబుతూ ఉంటారు. ఇదే విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వింత అనుభవం ఎదురయింది. టాస్ గెలిచిన తర్వాత రోహిత్ జట్టు నిర్ణయం ఏంటి అన్నది మర్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.


 రిఫరీగా ఉన్న జవగల్ శ్రీనాథ్ టాస్ కాయిన్ ఎగరవేయగానే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ హెడ్స్ అని కాల్ ఇచ్చాడు. అయితే కానీ టైల్స్ పడటంతో చివరికి రోహిత్ టాస్ గెలిచినట్లు అయింది. అయితే టాస్ గెలిచిన తర్వాత రోహిత్ అన్న నిర్ణయాన్ని మరిచిపోయాడు. దీంతో కాసేపటి వరకు తల గోక్కున్నాడు. తన నిర్ణయం ఏంటి గుర్తుచేసుకొని ఇక అప్పుడు తాను న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఇలా రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని ప్రకటించడం విషయంలో తడబాటుకు గురి కావడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇక ఇది చూసి రోహిత్ శర్మకు మరి ఇంత మతిమరుప అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: