ప్రపంచ క్రికెట్లో మిస్టర్ 360 ప్లేయర్ ఏపీ డిబిలియర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే అతని ఆట తీరుతో ఇక ప్రపంచ క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు ఎబి డివిలియర్స్. అయితే అతని లాగా బ్యాటింగ్ ప్రయత్నించి స్టార్ క్రికెటర్లుగా ఎదగాలని ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ విఫలం అయ్యారు అని చెప్పాలి. కానీ ఒక ఆటగాడు మాత్రం ఏకంగా తన ఆట తీరుతో అభిమానుల చేత జూనియర్ ఎబి డివిలియర్స్ అనిపేరు సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 ఇక అప్పటినుంచి ప్రపంచ క్రికెట్లో అతను జూనియర్ ఏ బి డివిలియర్స్ లాగానే బాగా పాపులర్ అవుతూ వస్తున్నాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ డివాల్ట్ బ్రేవిస్ ఇక ఐపీఎల్ లో కూడా ఆటగాడు మంచి ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ  ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ జట్టు అయిన కేప్ టౌన్ తరఫున ఆడుతున్నాడు. అయితే ముంబై జట్టుపై అభిమానంతో నా బ్లడ్ బ్లూ నా జెర్సీ రంగు బ్లూ అంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు.


 ప్రస్తుతం కేఫ్ టౌన్ జట్టులో సెటప్ అంతా ఎంతో అద్భుతంగా ఉంది. నేను ముంబైలోనే ఉన్నానేమో అని అనుభూతి కలుగుతుంది అంటూ డేవాల్ట్ బ్రెవిస్ చెప్పుకొచ్చాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంతేకాదు ఇక ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ,  సూర్య కుమార్ యాదవ్ లాంటి గొప్ప ఆటగాళ్లను నేను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వారితో కలిసి ఆడటానికి కూడా ఎంతో ఎంజాయ్ చేస్తాను అంటూ తెలిపాడు. ఇక వాళ్ల ఆట తీరుకు నేను ఎప్పటికీ అభిమానినే అంటూ డివాల్ట్ బ్రేవిస్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd