
ఈ రోజు ఇన్నింగ్స్ తో వాటన్నింటికీ తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. రోహిత్ శర్మ 85 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ చేసి బ్రెసెవెల్ అవుట్ అయ్యాడు. రోహిత్ కు తన కెరీర్ లో ఇది 30 వ సెంచరీ కావడం విశేషం. ఇతనికి శుబ్ మాన్ గిల్ నుండి చక్కని సహకారం లభించింది. గిల్ (112) సైతం కెరీర్ లో నాలుగవ సెంచరీని అందుకున్నాడు. వన్ డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ సెంచరీలు చేసి అందరికీ అందనంత ఎత్తులో టాప్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ 46 సెంచరీలతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మూడవ స్థానంలో రోహిత్ శర్మ 30 మరియు రికీ పాంటింగ్ 30 సెంచరీలతో మూఢవ స్థానంలో ఉన్నారు.
రిక్కీ పాంటింగ్ ఇప్పటికే రిటైర్ కాగా , రోహిత్ మరియు కోహ్లీ లకు ఇంకా ఆడే అవకాశం అది కాబట్టి ఎక్కువ సెంచరీలు చేసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 280 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో కోహ్లీ మరో సెంచరీని సాధిస్తాడా అన్నది తెలియాలంటే మరికొంతసేపు వేచి చూడాలి.