కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో మారుమోగిపోతున్న పేరు ఏదైనా ఉంది అంటే అది యువ ఓపనర్ శుభమన్ గిల్ పేరే అని చెప్పాలి. అద్భుతమైన ప్రదర్శనతో తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా అంచనాలకు మించి బ్యాటింగ్ చేస్తూ ఇక టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.  జట్టు తరఫున అవకాశం దక్కించుకుని ప్రతిసారి కూడా తన బ్యాటింగ్ జైత్రయాత్రను కొనసాగిస్తూ అదరగొడుతూ ఉన్నాడు.  సెంచరీ చేయడమె లక్ష్యంగా బ్యాట్ జులిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇలా కేవలం రోజుల వ్యవధిలోనే డబుల్ సెంచరీ, సెంచరీ చేసి అదరగొట్టాడు శుభమన్ గిల్. దీంతో ఇక టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానే అన్న విషయాన్ని మాటల్లో చెప్పడం కాదు ఏకంగా తన బ్యాటింగ్ తోనే నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శనలతో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవలే వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ  చేయడం ద్వారా ఎన్నో అరుదైన ప్రపంచ రికార్డులను సాధించాడు శుభమన్ గిల్.  ఇక ఇప్పుడు మూడు వన్డే మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోవడం కారణంగా ఇంకా ఎన్నో రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇక న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించిన శుభమన్ గిల్.. ఇక రెండో వన్డే మ్యాచ్లో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక మూడో మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో 360 పరుగులు చూసిన తొలి ఇండియన్ ప్లేయర్గా గిల్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఇప్పటివరకు మూడు వన్డేల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఉండగా.. ఇక ఇప్పుడు 360 పరుగులతో అతని రికార్డును సైతం బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు శుభమన్ గిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: